రేపటి భారత్ బంద్ నిర్వహణ వేళల్లో మార్పు
ప్రభుత్వం దిగి రాక తప్పదని, రైతులకు మేలు చేయని చట్టాలను తక్షణం ఉపసంహరించుకోవాలనీ పట్టుబడుతూ రైతు సంఘాలు రేపు దేశ వ్యాప్తంగా బంద్ జరుపుతున్నాయి.
కొత్త రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ వారం పదిరోజులుగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతు సంఘాలు రేపు భారత్ బంద్ నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వం దిగి రాక తప్పదని, రైతులకు మేలు చేయని చట్టాలను తక్షణం ఉపసంహరించుకోవాలనీ పట్టుబడుతూ రైతు సంఘాలు రేపు దేశ వ్యాప్తంగా బంద్ జరుపుతున్నాయి. అయితే బంద్ వల్ల ప్రజా రవాణాకు ఇబ్బంది కాకుడన్న ఉద్దేశంతో ఉదయం 11 గంటలనుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ అంటే కేవలం నాలుగు గంటలు మాత్రమే బంద్ నిర్వహిస్తున్నారు.
పెళ్లిళ్లు శుభకార్యాలకు వెళ్లే వారు పెళ్లి కార్డు చూపిస్తే వారిని అనుమతిస్తామనీ బంద్ నిర్వాహకులు ప్రకటించారు. భారత్ బంద్ కు మద్దతుగా రేపు లారీ యజమానుల సంఘం కూడా బంద్ జరుపుతోంది. రేపు ఎగుమతులు ఉండవని ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోతాయని లారీ యజమానుల సంఘం ప్రకటించింది. మరోవైపు రైతుల బంద్ కు మద్దతు ప్రకటించిన టీఆర్ ఎస్ పార్టీ రేపు బంద్ లో పాల్గొనాలని నిర్ణయించింది. ఎమ్మెల్సీ కవిత రేపు నిజామాబాద్ ముంబై హై వేపై ఉదయం 8 గంటలకు ధర్నాలో పాల్గొంటారు.
మరోవైపు షాద్ నగర్ లో కేటీఆర్, హరీష్ రావు కూడా ధర్నాల్లో పాల్గొంటున్నారు. ఇక రైతుల పోరాటానికి టీడీపీ మద్దతు ప్రకటించినా రేపటి బంద్ విషయంలో మాత్రం తటస్థంగా ఉండాలని నిర్ణయించింది.