Heavy Rains: తెలంగాణ వ్యాప్తంగా రేపు భారీ వర్షాలు

Heavy Rains: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

Update: 2021-09-20 03:41 GMT

తెలంగాణాలో భారీ వర్షాలు కురిసే అవకాశం (ఫైల్ ఇమేజ్)

‌Heavy Rains: తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురవగా మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి అక్కడక్కడ చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక రానున్న రెండ్రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణితోపాటు బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది ఒడిశా తీరానికి వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా హైదరాబాద్‌తోపాటు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Full View


Tags:    

Similar News