CEO Vikas Raj: అందుకే ఫలితాలు ఆలస్యమవుతున్నాయి..

CEO Vikas Raj: ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరుగుతోందని సీఈవో వికాస్‌రాజ్‌ తెలిపారు.

Update: 2022-11-06 07:05 GMT

CEO Vikas Raj: అందుకే ఫలితాలు ఆలస్యమవుతున్నాయి..

CEO Vikas Raj: ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరుగుతోందని సీఈవో వికాస్‌రాజ్‌ తెలిపారు. జాప్యం లేకుండా ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తామని, ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరుగుతోందన్నారాయన... ఓట్ల లెక్కింపు ఎలాంటి అవకతవకలు లేవన్నారు. అభ్యర్థులు ఎక్కువ మంది ఉండడం వల్లే ఆలస్యం జరుగుతోందని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. ప్రతి టేబుల్ వద్ద అబ్జర్వర్లు, కౌంటింగ్ ఏజంట్లు ఉన్నారని చెప్పారాయన. అయితే మిగత రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ఎక్కువమంది పోటీలో ఉండటంతోనే ఫలితాలు ఆలస్యమవుతున్నాయి. అందుకే ఎలక్షన్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేయడానికి ఆలస్యమవుతోందని సీఈఓ వికాస్‌రాజ్‌ చెప్పారు.

ఇదిలా ఉంటే, ఐదో రౌండ్ పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఐదో రౌండ్‌లో 917 ఓట్ల మెజారిటీ సాధించగా... ఐదో రౌండ్ పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ 1,430 ఓట్ల ఆధిక్యంలో ఉంది... ఫస్ట్, ఫోర్త్, ఫిఫ్త్ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ ఆధిక్యతలో ఉంది. టీఆర్ఎస్‌కు 6,162, బీజేపీకి 5,245 ఓట్లు వచ్చాయి. ఐదో రౌండ్ పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ 32,405, బీజేపీ 30,975, కాంగ్రెస్ 10,055 ఓట్లు సాధించాయి. 

Full View


Tags:    

Similar News