కాసేపట్లో హైదరాబాద్‌కు కేంద్ర ఎన్నికల బృందం

*ఏ వ్యక్తి ఎలాంటి ఎగ్జిట్‌పోల్స్ నిర్వహించకూడదని ఆదేశం

Update: 2023-11-01 04:30 GMT

తెలంగాణకు నేడు కేంద్ర ఎన్నికల బృందం, ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం.. 

Telangana: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ తెలంగాణకు ‌కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రానున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించేందుకు ఎన్నికల కమిషన్ సీనియర్‌ డిప్యూటీ కమిషనర్లు ధర్మేంద్రశర్మ, నీతీష్‌కుమార్‌ వ్యాస్‌ బృందాన్ని రాష్ట్రానికి పంపింది. ఈ అధికారులు బుధవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌, సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

అనంతరం రేపు తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల ఉన్నతాధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు ఎన్నికల అధికారులు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల డీజీపీలు, ముఖ్య అధికారులతో ఈసీ టీమ్ సమావేశం అవనుంది. ఎన్నికల సందర్భంగా అక్కడి నుంచి డబ్బు, మద్యం తదితరాలు రవాణా అరికట్టే అంశంపై చర్చించనుంది.

Tags:    

Similar News