Delhi: టీఆర్ఎస్ ఎంపీ ఇంట సీబీఐ ట్రాప్ లో బుక్ అయిందెవరు?

Delhi: ఢిల్లీలో తెలంగాణ ఎంపీ పీఏలమంటూ డబ్బు వసూళ్లకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు సీబీఐ అధికారులు.

Update: 2021-04-01 13:57 GMT

Delhi: టీఆర్ఎస్ ఎంపీ ఇంట సీబీఐ ట్రాప్ లో బుక్ అయిందెవరు?

Delhi: ఢిల్లీలో తెలంగాణ ఎంపీ పీఏలమంటూ డబ్బు వసూళ్లకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు సీబీఐ అధికారులు. టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోతు కవిత పీఏల పేరుతో డబ్బు వసూళ్లు చేస్తున్నట్టు గుర్తించారు. ఢిల్లీలోని ఓ ఇల్లు అక్రమ నిర్మాణమంటూ ఇంటి యజమానిని నిందితులు రాజీవ్‌ భట్టాచార్య, సుభాంగి గుప్తా, దుర్గేష్‌ కుమార్‌ బెదిరింపులకు గురిచేశారు. యజమాని నుంచి 5 లక్షలు డిమాండ్‌ చేశారు. ఓ లక్ష తీసుకుంటుండగా అక్కడికి చేరుకున్న సీబీఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా ముగ్గురిని పట్టుకున్నారు. ఘటనపై మన్మిత్‌ సింగ్‌ లంబా ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరోపక్క ఘటనపై స్పందించారు తెలంగాణ ఎంపీ మాలోతు కవిత. ఢిల్లీలో తనకు ఎటువంటి పీఏలు లేరని స్పష్టం చేశారు. దుర్గేష్‌ కుమార్‌ తన కారు డ్రైవర్‌ అని మిగిలిన ఇద్దరూ ఎవరో తనకు తెలియదని స్పష్టం చేశారు. ఇంటిని చూసుకుంటాడని తాళాలు దుర్గేష్‌కు ఇచ్చి వచ్చినట్టు తెలిపారు ఎంపీ మాలోతు కవిత. 

Tags:    

Similar News