జనగామ శ్రీమంతుడు.. సుమారు 6కోట్లు సొంత డబ్బులతో..

Bibipet: ఆయన జనగామ శ్రీమంతుడు. విల్లాలను తలపించే డబుల్ బెడ్ రూంల నిర్మాణం చేసి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచాడు.

Update: 2021-11-10 11:50 GMT

జనగామ శ్రీమంతుడు.. సుమారు 6కోట్లు సొంత డబ్బులతో..

Bibipet: ఆయన జనగామ శ్రీమంతుడు. విల్లాలను తలపించే డబుల్ బెడ్ రూంల నిర్మాణం చేసి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచాడు. తనకు చదువు నేర్పిన పాఠశాలను రాష్ట్రానికి రోల్ మోడల్‌గా అధునాతనంగా తీర్చిదిద్దారు. ఆయనే సుభాష్ రెడ్డి. మూడు ఎకరాల విస్తీర్ణంలో 33 తరగతి గదులను నిర్మించి మరో రికార్డు సృష్టించారు. సుమారు 6కోట్లు సొంత డబ్బులతో కార్పొరేట్ స్కూల్‌ను తలదన్నేలా జిల్లా పరిషత్ పాఠశాలను తీర్చిదిద్దారు. మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా గ్రామానికి అంకితం చేశారు.

కామారెడ్డి జిల్లా బీబీపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. సుమారు 653 మంది విద్యార్ధులు చదివే ఈ పాఠశాలను ఆధునిక హంగులతో కార్పొరేట్ పాఠశాలను తలదన్నేలా నిర్మించారు పూర్వ విద్యార్ధి తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం 6కోట్లు వెచ్చించి ఈ పాఠశాలను మూడు ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో నూతన భవనం నిర్మించారు. ల్యాబ్‌లు, లైబ్రరీలతో పాటు తరగతి గదులు, కంప్యూటర్ గదులు ఇలా సుమారు 33 గదులను నిర్మించారు.

బిల్డర్‌గా స్ధిరపడ్డ సుభాష్ రెడ్డి 8 నుంచి 10వ తరగతి వరకు బీబీపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. పుట్టిన ఊరికి సేవ చేయాలని తపనతో జనగామలో 52, జంగంపల్లి గ్రామంలో 50 డబుల్‌ బెడ్రూం ఇళ్లను విల్లాల తరహాలో నిర్మించి ఔరా అనిపించారు. ఇప్పుడు చదువు నేర్పిన పాఠశాలకు నూతన భవనాన్ని నిర్మించి మరో రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ స్కూల్స్ తరహాలో విశ్రాంతి గదులు, ఒకేసారి 300 మంది సమావేశమయ్యేలా కాన్ఫరెన్స్‌ హాల్‌, హెడ్‌ మాస్టర్‌కు, ఉపాధ్యాయులకు ప్రత్యేక గదులు నిర్మించారు. ఈ పాఠశాలలో చదివి ఉన్నత స్ధానాలకు విద్యార్ధులు చేరుకుంటే తన లక్ష్యం నెరవేరినట్లు అవుతుందని చెబుతున్నారు దాత సుభాష్ రెడ్డి.

Full View


Tags:    

Similar News