Business Man in Hyderabad: బర్త్ డే పార్టీ ఇచ్చిన వ్యాపారికి ఏమయిందో తెలుసా?
Business Man in Hyderabad: కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నో చర్యలను తీసుకుంది.
Business Man in Hyderabad: కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నో చర్యలను తీసుకుంది. ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సామాజిక దూరం పాటించాలి, మాస్కులు, షానిటైజర్లు తప్పకుండా వాడాలని సూచించింది. అంతే కాదు శుభకార్యాలకు, అశుభకార్యాలను పెద్ద ఎత్తున్న జనం వెల్లకూడదని కూడా తెలిపింది. అయినా చాలా మంది ప్రజలు మనకు వైరస్ సోకదు అనే ధీమాతో ప్రభుత్వం తెలిపిన జాగ్రత్తలను పాటించకుండా ఉంటున్నారు. పెళ్లిళ్లకు, పేరంటాళ్లకు, పుట్టిన రోజు వేడుకలకు వెలుతున్నారు. అక్కడ స్వీట్ లతో పాటు కరోనాను కూడా వెంట తెచ్చుకుంటున్నారు. ఈ విధంగానే ఇప్పటి వరకు ఎంతో మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు తాజాగా ఇదే క్రమంలో హైదరాబాద్‌లో బర్త్ డే పార్టీ ఇచ్చిన ఓ వజ్రాభరణాల వ్యాపారి.. కొద్ది రోజులకే ప్రాణాలు కోల్పోయారు. పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న మరో వ్యాపారి కూడా కరోనాకు బలయ్యారు. దీంతో ఆ పుట్టిన రోజు వేడుకలకు వెళ్లిన వారంతా బిక్కు బిక్కు మంటున్నారు.
ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే నగరంలోని హిమాయత్ నగర్‌కు చెందిన ఓ వజ్రాభరణాల వ్యాపారి బంధు మిత్రులు, తోటి వ్యాపారులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జూన్ మూడో వారంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్నారు. కాగా ఆ వేడుకలను సుమారుగా 150 మంది వచ్చారు. వేడులకలకు వచ్చిన వారు కూడా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. బర్త్ డే పార్టీ నిర్వహించిన హాల్‌ను ముందుగానే శానిటైజ్ చేయడంతోపాటు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అంతే కాదు వేడుకలకు వచ్చిన వారికి స్వీట్లతో పాటు మంచి మంచి గిఫ్టులు కూడా ఇచ్చారు. అక్కడి వరకు బాగానే ఉంది. ఇక పుట్టిన రోజలు వేడుకలు జరిగిన మూడు రోజులకే ఆ వ్యాపారిలో దగ్గు, ఆయాసం లాంటి కరోనా లక్షణాలు కనిపించాయి. వెంటనే వారి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్ళినప్పటికీ ఆయన కరోనా టెస్టులు చేయించుకోకుండా మందులు మాత్రమే తీసుకున్నాడు. మరికొన్ని రోజులకు అతనికి దగ్గు, ఆయాసం, జ్వరం కూడా రావడంతో ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు.
ఆ తరువాత సరిగ్గా నాలుగు రోజులకి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న మరో వ్యాపారి కూడా జ్వరం బారిన పడ్డాడు. సరిగ్గా వారం రోజుల క్రితం జ్వరం తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ప్రయివేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడ ఆయన్ని పరీక్షించి వైద్యులు అతనికి కరోనా సోకినట్టు నిర్ధారించారు. ఆ తరువాత అతను చికిత్స పొందుతూ మృతి చెందారు. వారితో పాటు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న ఓ ప్రజాప్రతినిధి సహా 20 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమయిన అధికారులు ఆ బర్త్ డే పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారు, వారు ఎవర్ని కలిశారనే వివరాలను పోలీసులు, జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య శాఖ అధికారులు కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.