తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS పోరుబాట

BRS: LRSకు వ్యతిరేకంగా నేడు BRS ధర్నాలు

Update: 2024-03-06 04:00 GMT

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS పోరుబాట

BRS: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుబాటకు దిగింది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ. లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్‌పై సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనుంది. అసెంబ్లీ నియోజకవర్గాలు, హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కార్యాలయాల వద్ద ధర్నాలకు పిలుపునిచ్చింది. రేపు జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను కలిసి వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించింది బీఆర్ఎస్.

ఆనాడు తాము తెచ్చిన పథకాలకు అడ్డుచెప్పిన ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం.. అవే పనులు చేస్తోందని విమర్శిస్తోంది బీఆర్ఎస్. తాము ఎల్‌ఆర్‌ఎస్ తీసుకొస్తే కోర్టులో కేసు వేశారని మండిపడింది. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఎల్‌ఆర్‌ఎస్‌పై మాట మార్చారంటూ ఫైర్ అవుతోంది. ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ ఉచితంగా అమలు చేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది. కాగా.. లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా 2020 నుంచి పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి మార్చి 31లోగా క్రమబద్ధీకరణ ప్రక్రియను ముగించాలని ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేసింది కాంగ్రెస్ సర్కార్.

Tags:    

Similar News