CM KCR: ఆపద మొక్కులు మొక్కేవారిని నమ్మొద్దు‌.. కాంగ్రెస్‌ పార్టీని బంగాళాఖాతంలో కలపాలి..

CM KCR: అన్ని పనులు చేస్తాం అని జనగామ సభకు హాజరైన ప్రజానికాన్ని ఉద్దేశించి కేసీఆర్‌ కోరారు.

Update: 2023-10-16 11:51 GMT

CM KCR: ఆపద మొక్కులు మొక్కేవారిని నమ్మొద్దు‌.. కాంగ్రెస్‌ పార్టీని బంగాళాఖాతంలో కలపాలి..

CM KCR: జనగామ వైద్యకళాశాల మైదానంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు. ఆపద మొక్కుల మాదిరిగా కొందరు ఏదేదో చెబుతారు. వాళ్ళ మాటలు నమ్మితే మోసపోయి గోస పడుతాం. ప్రజాస్వామ్యంలో బలమైన ఆయుధం ఓటు అని.. అందుకే ఆలోచించి ఓటేయాలని జనగామ ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపు ఇచ్చారు.

రానున్న ఎన్నికల్లో జనగామ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తే..చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తామని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ హామీ ఇచ్చారు. జనగామ జిల్లాలో మెడికల్‌ కాలేజీతోపాటు నర్సింగ్‌, పారామెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. ధరణి పోర్టల్‌ను తీసేసి బంగాళాఖాతంలో వేస్తామని విపక్షాలు అంటున్నాయి. రైతుల మీద అధికారులను మళ్లీ రుద్దాలని విపక్షాలు చూస్తున్నాయి. వ్యవసాయానికి 3 గంటల కరెంట్‌ చాలని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. ఆ పార్టీని బంగాళాఖాతంలో కలపాలి.

ఎన్నికలు వచ్చినప్పుడు కనిపించేవారిని నమొద్దు. ఓటు మన తలరాత మారుస్తుంది.. ఆలోచించి ఓటు వేయండి. మంచి ఏదో, చెడు ఏదో గుర్తించి ఓటేయండి. వందకు వంద శాతం జనగామ అభివృద్ధి జరిగి తీరుతుంది. జనగామ లో ఏం జరగాలనుకున్నామో.. అవన్నీ జరుగుతాయి. ఎన్నికల తర్వాత మళ్ళీ వస్తా.. అన్ని పనులు చేస్తాం అని జనగామ సభకు హాజరైన ప్రజానికాన్ని ఉద్దేశించి కేసీఆర్‌ కోరారు.

Tags:    

Similar News