BRS Party: బీఆర్ఎస్ ‘స్వేద ప‌త్రం’ విడుద‌ల రేప‌టికి వాయిదా

BRS Party: గణాంకాలతో వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని..పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించనున్న కేటీఆర్‌

Update: 2023-12-23 05:55 GMT

BRS Party: బీఆర్ఎస్ ‘స్వేద ప‌త్రం’ విడుద‌ల రేప‌టికి వాయిదా

BRS Party: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ స్వేద పత్రం విడుదల రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటలకు దశాబ్దికాల తెలంగాణ డెవలప్‌మెంట్‌పై స్వేదపత్రానికి సంబంధించి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అసెంబ్లీలో నూతన ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలకు కౌంటర్‌గా ప్రతిపక్ష బీఆర్ఎస్ స్వేదపత్రం పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గణాంకాలతో వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని పవర్‌పాయింట్ ద్వారా ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు కేటీఆర్.

Tags:    

Similar News