KCR: త్వరలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌

KCR: భవిష్యత్‌లో కూడా ఉన్నతస్థానంలో ప్రవీణ్ ఉంటారు

Update: 2024-03-19 02:12 GMT

KCR: త్వరలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌

KCR: బీఆర్ఎస్ పార్టీ అధినేత కీలక ప్రకటన చేశారు. త్వరలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌‌ను ప్రకటిస్తామన్నారు. భవిష్యత్‌లో కూడా ఉన్నతస్థానంలో ప్రవీణ్ ఉంటారని తెలిపారు. మంచి ఆశయం కోసం పనిచేసిన ప్రవీణ్‌కు రాజకీయ సామాజిక ఫలితాలుంటాయన్నారు కేసీఆర్. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కు ఏ పార్టీలో లేని స్పేస్ బీఆర్ఎస్‌లో ఉంటుందని స్పష్టం చేశారు. ఆచరణయోగ్యమైన కార్యాచరణతో ప్రజల్లో కలిసి పనిచేద్దామన్న కేసీఆర్.. బహుజన సిద్ధాంతాన్ని ఎజెండా బలంగా అమలు చేసే దిశగా భారతదేశానికి టార్చ్ బేరర్‌గా పనిచేద్దామని సూచించారు.

Tags:    

Similar News