ట్యాంక్‌బండ్‌పై ధర్నాకు పిలుపునిచ్చిన గులాబీ నేతలు.. కొనసాగుతున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ముందస్తు అరెస్టులు
BRS Leaders: బీఆర్‌ఎస్ నేతల అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ.. ట్యాంక్‌బండ్‌పై గులాబీ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది.
BRS Leaders: బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ.. ట్యాంక్‌బండ్‌పై గులాబీ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ముందస్తు అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. మాజీమంత్రి హరీష్‌రావు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటు.. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందను ముందస్తుగా అరెస్ట్ చేశారు.
వివేకా ఇంటి దగ్గర భారీగా పోలీసుల మోహరించారు. ట్యాంక్‌బండ్‌పై ధర్నాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లకుండా ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. అటు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇంటి దగ్గర కూడా పోలీసులు మోహరించారు.