Hyderabad: బ్రెస్ట్ క్యాన్సర్‌పై నెక్లెస్ రోడ్లో అవగాహనా ర్యాలీ
Hyderabad: మారథాన్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు
Hyderabad: వరల్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ మంత్ సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్ వద్ద అవగాహన వాక్, మారథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. రోమ్ము క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి హరీష్‌రావు సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ నెలను ప్రతి ఏడాది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్‌గా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఒకప్పుడు పెద్ద వయస్సులో మాత్రమే కనిపించే ఈ మహమ్మారి నేడు 30 నుంచి 40 ఏళ్ల వారిలోనూ కనిపిస్తోందని తెలిపారు.
వ్యాధికి సంబంధించిన అవగాహన లేకపోవడం కారణంగా అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో నిర్ధారణ జరుగోంన్నదని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో చికిత్స అందించడం కష్టంగా ఉంటుందన్నారు. వ్యాధిని ముందస్తుగా గుర్తిస్తే వంద శాతం ప్రాణాలు కాపాడుకోవచ్చని మంత్రి చెప్పారు. MNJ, నిమ్స్ ఆసుపత్రులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ రోగులకు అవసరమైన చికిత్స అందిస్తున్నాయని వివరించారు.