Bomb Threat: ప్రజాభవన్, నాంపల్లి కోర్టులో బాంబుపెట్టినట్టు ఫోన్ చేసిన వ్యక్తి అరెస్ట్
Bomb Threat: ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు కేసులో పురోగతి సాధించారు పోలీసులు.
Bomb Threat: ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు కేసులో పురోగతి సాధించారు పోలీసులు. 24 గంటల్లోనే నిందితుడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు గుంటూరుకు చెందిన రామకృష్ణగా గుర్తించారు. నిన్న ప్రజాభవన్, నాంపల్లి కోర్టులో బాంబు పెట్టామంటూ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు రామకృష్ణ. అయితే.. భార్యతో గొడవలతో మద్యానికి బానిసైన రామకృష్ణ.. మద్యం మత్తులో ఫోన్ చేసినట్టు చెబుతున్నాడు.