Black Fungus: తెలంగాణలో పెరుగుతున్న బ్లాక్‌ ఫంగస్‌ కేసులు

Black Fungus: జగిత్యాల జిల్లా శ్రీరాములపల్లికి చెందిన వ్యక్తికి బ్లాక్ ఫంగస్‌

Update: 2021-05-18 06:26 GMT

Black Fungus: తెలంగాణలో పెరుగుతున్న బ్లాక్‌ ఫంగస్‌ కేసులు

Black Fungus: తెలంగాణలో బ్లాక్‌ ఫంగస్‌ కలకలం కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా శ్రీరాములపల్లికి చెందిన రాంగోపాల్‌రెడ్డికి ఏప్రిల్‌లో కరోనా సోకింది. గ్లోబల్‌ ఆస్పత్రిలో పదిరోజుల ట్రీట్‌మెంట్‌కు ఆరున్నర లక్షలు ఖర్చయింది. అయితే.. హెవీ డోస్ ట్రీట్‌మెంట్‌ కారణంగా ముఖ భాగంలోని చెంపలు మొద్దుబారిపోయాయి. స్పర్శ లేదని చెప్తే సైనసైటిస్‌గా భావించిన వైద్యులు చికిత్స అందించారు. అయినప్పటికీ ఎలాంటి మార్పు కనిపించలేదు.

దీంతో బ్లాక్‌ ఫంగస్‌గా అనుమానించిన డాక్టర్లు.. ఈఎన్‌టీ డాక్టర్‌కు సిఫారసు చేశారు. గచ్చిబౌలిలోని ఏజీఐ ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయించుకోగా బ్లాక్‌ ఫంగస్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటికే కోవిడ్‌ ట్రీట్‌మెంట్‌కు లక్షల డబ్బు ఖర్చయిందని, ఇప్పుడు బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం వాడే మందులు చాలా ఖరీదైనవని అంటున్నాడు బాధితుడు. తనకు ఆర్థికసాయం అందించాలంటూ కోరుతున్నారు. సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వ్యక్త పరిచాడు బాధితుడు రాంగోపాల్‌.

Tags:    

Similar News