TS BJP: తెలంగాణలో వేగం పెంచిన కమలం పార్టీ
TS BJP: అసెంబ్లీ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్న నడ్డా, బీఎల్ సంతోష్
TS BJP: తెలంగాణలో ఎన్నికల వ్యూహాలను భారతీయ జనతా పార్టీ మరింత వేగవంతం చేసింది. ఓ వైపు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తూ మరో వైపు ప్రజల్లోకి వెళ్లేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. మెయిన్‌గా అధికార పార్టీ వైఫల్యాలు ఎండగడుతూ, మరోవైపు కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపిస్తూ.. ఈ రెండు పార్టీలు తెరవెనుక జోడికట్టాయని ఆరోపణలు చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్లాన్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోడీ ఇప్పటికే ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. మహబూబ్‌నగర్ సభలో హామీల వర్షం కురిపించి. నిజామాబాద్‌లో సంచలన వ్యాఖ్యలు చేసి తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తెలంగాణకు రానున్నారు. పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. మరో వైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం రేపు హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా స్టేట్ కౌన్సి్ట్ మీటింగ్‌లో పాల్గొననున్నారు.
ఎన్నికల ముందు జరుగుతున్న పథాదికారుల సమావేశంలో పలు తీర్మానాలు రూపొందించనున్నారు. ఆ తర్వాత ఘట్కేసర్లో రేపు జరిగే కౌన్సిల్ భేటీలో తీర్మానాలపై చర్చించి ఆమోదించనున్నారు. ఆ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా హాజరుకానున్నారు. అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.