Vijayasanthi: ఎన్నికలు ఉంటేనే ప్రభుత్వానికి రైతులు గుర్తొస్తారా?
Vijayasanthi: కేసీఆర్ సర్కారుపై మరోసారి విరుచుకపడ్డారు బీజేపీ నాయకురాలు విజయశాంతి.
Vijayasanthi: కేసీఆర్ సర్కారుపై మరోసారి విరుచుకపడ్డారు బీజేపీ నాయకురాలు విజయశాంతి. ఎన్నికలు ఉంటే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తాను చేయాల్సిన పనులు గుర్తుకురావని మండిపడ్డారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనితీరాలని స్పష్టం చేశారు. తాలు, తరుగు పేరుతో రైతులను వేధించవద్దని తెలిపారు.
టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇంకా సగం కూడా రుణమాఫీ జరగలేదని ఆరోపించారు. వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు కష్టాలు వెంటనే పరిష్కారం కావాలన్న ఆకాంక్షతో రేపు (సోమవారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు 'తెలంగాణ రైతు గోస-బీజేపీ పోరు దీక్ష' చేపట్టాలని నిర్ణయించినట్టు విజయశాంతి ప్రకటించారు.