Sandhya Theatre Stampede Case: పోలీసుల నోటీసులకు సంధ్య థియేటర్ ఏం చెప్పిందంటే...

Update: 2024-12-29 11:00 GMT

Sandhya Theatre Stampede Case: సంధ్య థియేటర్ ఘటన తరువాత పోలీసులు ఇచ్చిన నోటీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం స్పందించింది. పోలీసులకు వివరణ ఇస్తూ 6 పేజీల లేఖను అడ్వకేట్స్ ద్వారా పోలీసులకు పంపించింది. సంధ్య థియేటర్ కు అన్నిరకాల అనుమతులు ఉన్నాయని థియేటర్ యాజమాన్యం తమ వివరణలో పేర్కొంది.

గత 45 ఏళ్లుగా సినిమాలు ప్రదర్శిస్తున్నామని, ఎన్నో సినిమాలకు స్టార్ హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్ వచ్చి వెళ్లారు కానీ ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదని యాజమాన్యం చెప్పుకొచ్చింది. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా డిసెంబర్ 4, 5 తేదీల్లో సంధ్య థియేటర్‌ను ఆ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎంగేజ్ చేసుకుందని థియేటర్ యాజమాన్యం తమ లేఖ ద్వారా పోలీసులకు తెలియజేసింది.

పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అయింది. అంతకంటే ముందు రోజు రాత్రే బెనిఫిట్ షో చూసేందుకు అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి సంధ్య థియేటర్ కు వచ్చాడు. అల్లు అర్జున్ రాకతో అభిమానులు ఆయన్ని చూసేందుకు ఎగబడ్డారు. దీంతో అక్కడ భారీ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయారు. ఆమె కొడుకు 9 ఏళ్ల శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిపాలయ్యారు.

ఈ తొక్కిసలాట ఘటనతో సంధ్య థియేటర్ యాజమాన్యం చిక్కుల్లో పడింది. అనుమతి లేకుండా వచ్చి తొక్కిసలాటకు కారణం అయ్యాడనే అభియోగాలతో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదైంది. ప్రస్తుతం అల్లు అర్జున్, సంధ్య థియేటర్ యాజమాన్యం, సిబ్బంది, అల్లు అర్జున్ బౌన్సర్స్ ఈ కేసు విచారణ ఎదుర్కుంటున్నారు. ఈ విచారణలో భాగంగానే పోలీసులు ఇచ్చిన నోటీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.  

Tags:    

Similar News