Rohith Reddy: టీఆర్ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చామనే బీజేపీకి భయం

Rohith Reddy: నాకు ఈడీ పంపిన నోటీసుల్లో ఏ వివరాలు అడగలేదు

Update: 2022-12-25 11:19 GMT

టీఆర్ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చామనే బీజేపీకి భయం

Rohith Reddy: బీజేపీపై ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫైరయ్యారు. కావాలనే తనను తన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు. బీజేపీ బండారాన్ని బయటపెట్టినందుకు ఈడీ, సీబీఐని ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. తనకు ఈడీ పంపిన నోటీసుల్లో ఏ వివరాలు అడగలేదని కేవలం తన, తన కుటుంబ ఆస్తులు అడుగుతూ ఈడీ నోటీసులు ఇచ్చిందని వివరించారు. టీఆర్ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చడంతో బీజేపీకి భయం పట్టుకుందన్నారు. ఎమ్మెల్యేల కుట్ర కేసులో ఎక్కడా డబ్బులు బయటకు రాలేదన్న రోహిత్‌రెడ్డి తనను భయభ్రాంతులకు గురి చేసేందుకే ఈడీని రంగంలోకి దించారని విమర్శించారు.

డబ్బులు చేతులు మారనప్పుడు ఈడీ ఎలా ప్రశ్నిస్తుందన్నారు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి. మనీలాండరింగ్ అంశం అసలు ఎక్కడ ఉందన్న ఆయన తనను ఇబ్బంది పెట్టేందుకే అభిషేక్‌ను కూడా ప్రశ్నించారన్నారు. కుట్రలో భాగంగానే తన తమ్ముడిని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. అభిషేక్‌ను విచారించినా ఎలాంటి ఆధారాలు రాబట్టలేకపోయారని తెలిపారు. తనను ఎన్నిసార్లు ప్రశ్నించినా అరెస్ట్ చేసినా లొంగేప్రసక్తే లేదన్నారు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి. బీజేపీ కొత్త కుట్రను తిప్పికొడతామని ఈడీ నోటీసులు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తామన్నారు.

 నందకుమార్‌ ద్వారా నచ్చిన స్టేట్‌మెంట్ తీసుకొని ఈడీ ఇబ్బంది పెట్టాలని చూస్తోందన్నారు. నందకుమార్‌తో స్టేట్‌మెంట్ తారుమారు చేయబోతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్న ఎమ్మెల్యే కంప్లైంట్ చేసిన వారిని ప్రశ్నించారు కానీ నిందితులను ఎందుకు ప్రశ్నించలేదన్నారు. రోహిత్‌రెడ్డిని అరెస్ట్ చేస్తామని బీజేపీ నేతలు లీక్‌లు ఇస్తున్నారని ఓ నేత ఇప్పుడేం జరిగింది ఇంకా ముందుందని రోహిత్‌రెడ్డి పరిస్థితి ముందు ముందు ఏమవుతుందో చూడాలని హెచ్చరిస్తున్నారన్నారు. బీఎల్ సంతోష్‌ లాగా తాను విచారణను తప్పించుకోలేదని బీజేపీ నేతలు తప్పు చేయనప్పుడు విచారణకు ఎందుకు హాజరుకావడం లేదని ప్రశ్నించారు.

Tags:    

Similar News