Bandi Sanjay: రాజగోపాల్రెడ్డి రాజీనామాతోనే మునుగోడులో అభివృద్ది మొదలైంది
Bandi Sanjay: మునుగోడులోనూ దుబ్బాక, హుజురాబాద్ ఫలితాలు రిపీటవుతాయి
Bandi Sanjay: దుబ్బాక, హుజురాబాద్ ఫలితాలే మునుగోడులోరిపీట్ కాబోతున్నాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ లో కలిసి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశాకే నియోజకవర్గంలో అభివృద్ది పనులు జరుగుతున్నాయన్నారు. ప్రగతిభవన్ లో ఉండే సీఎంను లెంకల్లపల్లి ఇంఛార్జ్ గా తీసుకొచ్చిన ఘటన బీజేపీ అభ్యర్థిదే అన్నారు. సీఎం కేసీఆర్ డబ్బులు పంచుతున్నారన్నది వాస్తవమన్న ఆయన సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల అవినీతిపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరిరారు.