గట్టుప్పల్ మండలంలో బీజేపీ అభ్యర్ధి సతీమణి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి ప్రచారం
*కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన గట్టుప్పల్ ప్రజలు
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలో పార్టీలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నాయి. గట్టుప్పల్ మండల కేంద్రంలో, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి ప్రచారం చేస్తున్నారు. కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డికి గట్టుప్పల్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎన్నో సంవత్సరాల ప్రజల కల గట్టుప్పల్ మండలం రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే వచ్చిందని ప్రజలకు వివరించి.. లక్ష్మి రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు.