బీజేపీ-జనసేన పొత్తు ఖరారు.. పవన్ పార్టీకి 11 సీట్లు కేటాయింపు!

BJP - Janasena: కాసేపట్లో అభ్యర్థులను ప్రకటించనున్న జనసేన

Update: 2023-11-04 07:40 GMT

బీజేపీ-జనసేన పొత్తు ఖరారు.. పవన్ పార్టీకి 11 సీట్లు కేటాయింపు!

BJP - Janasena: తెలంగాణలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. కొద్ది రోజులుగా స్తానాలపై సందిగ్ధతలో ఉన్న పార్టీలు ఎట్టకేలకు పొత్తును ఫైనల్ చేసుకున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాల నుంచి జనసేన పోటీ చేయనుంది. ఈ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను కాసేపట్లో ప్రకటించనుంది జనసేన.

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రయత్నాలు ఫలించాయి. పొత్తులో భాగంగా శేరిలింగం పల్లి టికెట్ జనసేనకు ఇచ్చే అవకాశాలున్నాయని వార్తలు రావడంతో ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. చేవెళ్ల పార్లమెంట్‌లో గెలవాలంటే.. శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీనే బరిలోకి దిగాలని ఆయన కోరారు. దీంతో శేరిలింగం పల్లి స్థానాన్ని మినహాయించింది అధిష్టానం. GHMC పరిధిలోని కూకట్‌పల్లి, మల్కాజ్‌గిరితో పాటు నాంపల్లి నుంచి జనసేనను బరిలో దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Tags:    

Similar News