హైదరాబాద్ నగర వాసులను ఒక సమస్య కాకపోతే మరొక సమస్య వెంటాడుతూ వస్తుంది. నగరంలో వర్షాలు ప్రారంభం కాకముందు రెండు మూడు సార్లు భూమి కంపించడంతో భయభ్రాంతుకు లోనైన నగరవాసులు తరువాత వరదల బారిన పడి అష్టకష్టాలు పడుతున్నారు. వరదలు కాస్త తగ్గుముఖం పట్టిందనే సమయానికి హైదరాబాద్ నగరంలోని పలుప్రాంతాల్లో మరోసారి భారీ శబ్దాలు వచ్చాయి. దీంతో ఇండ్లలో ఉన్న ప్రజలందరూ ఒక్కసారిగా భయాందోళనలకు గురై బయటికి పరుగులు తీశారు. నగరంలోని రాజేంద్రనగర్ సర్కిల్ సులేమాన్ నగర్, చింతల్ మెట్, పహడీ, తదితర ప్రాంతాలలో అర్ధరాత్రి సమయంలో భారీ శబ్దాలు రావడంతో ప్రజలు కంగుతిన్నారు. రాత్రి వర్షంలో జనం భయాందోళనలకు వ్యక్తం చేస్తూ బయటకు పరుగులు తీశారు. రాత్రంతా బయటే ఉన్నారు. అంతకుముందు బోరబండ ప్రాంత వాసుల్ని కూడా భరీ శబ్ధాలు భయపెట్టాయి.
అయితే గతంలో కూడా ఇదేవిధంగా భారీ శబ్దాలు వచ్చాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల ముందు గచ్చిబౌలిలో కూడా భూకంపం వచ్చిందన్న వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని ప్రజలు భూమికంపించిందని ఆందోళనకు గురి చేస్తున్నాయి. అర్ధరాత్రి వేల భారీ శబ్దాలు రావడంతో ప్రజలు భయకంపితులయ్యారు. ఇక ఈ సమాచారం అందగానే రాజేందర్ నగర్ ఎంఐఎం పార్టీ కంటెస్టెంట్స్ అభ్యర్థి మీర్జా రహిమత్ బేగ్ భారీ శబ్దాలు వచ్చిన ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలెవ్వరూ భయాందోళనకు గురి కావలసిన అవసరం లేదని, ప్రజలు ధైర్యంగా ఉండాలని తెలిపారు.