అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. నామినేషన్ వేసేందుకు మంచి ముహూర్తాలు ఇవే..!

Telangana Elections 2023: మంచి రోజునే నామినేషన్లు వేయనున్న అభ్యర్థులు

Update: 2023-11-03 10:42 GMT

అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. నామినేషన్ వేసేందుకు మంచి ముహూర్తాలు ఇవే..!

Telangana Elections 2023: అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు ఉదయమే విడుదల అయింది. దీంతో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయింది. ఈనెల 10వ తేదీ వరకు నామినేషన్లు వేయొచ్చు. 13వ తేదీ వరకు నామినేషన్లను స్క్రూటినీ చేస్తారు. ఈనెల 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు చాన్స్ ఉంది.

ఎన్నికల ప్రక్రియలో కీలకమైన నామినేషన్లు దాఖలు చేసే ఘట్టం ప్రారంభం కావడంతో ఎమ్మెల్యే అభ్యర్థులు అప్రమత్తమవుతున్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారంతో దూసుకుపోతున్న అన్ని పార్టీల అభ్యర్థులు.. సెంటిమెంట్లను సైతం ఫాలో అవుతున్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు బలమైన ముహూర్తాలను చూసుకుంటున్నారు. ఇవాళ్టి నుంచి నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ వేసేందుకు అవకాశం ఉండడంతో ఈవారం రోజుల్లో... ఏ రోజు ముహూర్తం బాగుందో తెలుసుకోవడానికి జ్యోతిష్యుల వద్దకు క్యూ కడుతున్నారు. తిథి, వారం, నక్షత్రం ఇలా అన్ని ముహూర్త బలాలు చూసుకుని నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు.

ఈ క్రమంలో నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏ రోజు ముహూర్తం బాగుందనే విషయాలను అభ్యర్థులకు జ్యోతిష్యులు చెబుతున్నారు. ప్రముఖంగా 3, 6, 9వ తేదీల్లో ఎక్కువగా ముహూర్తాలు బాగున్నాయని తెలిపారు. ఈ రోజు కూడా నామినేషన్లు దాఖలు చేయడానికి మంచి ఉంది. 6వ తేదీన ఉదయం 10 గంటల 40 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల 16 నిమిషాల వరకు, 7వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, 8వ తేదీన ఉదయం 10 గంటల 11 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాల వరకు, 9వ తేదీన ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాల వరకు, 10వ తేదీన ఉదయం 9 గంటల 16 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల 51 నిమిషాల వరకు శుభ ముహూర్తాలు ఉన్నాయని పలువురు జ్యోతిష్యులు తెలిపారు.

ఈనెల 9న పెద్దఎత్తున నామినేషన్లు వేయడానికి చాలామంది అభ్యర్థులు జ్యోతిష్యులను సంప్రదిస్తున్నారు. దీంతో 9వ తేదీన భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. కాగా ఈసారి సీఎం కేసీఆర్ సైతం నవంబర్ 9వ తేదీనే గజ్వేల్‌, కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లలో నామినేషన్ వేయనున్నారు.

Tags:    

Similar News