ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. పోలీసుల అదుపులో భూపాలపల్లి అదనపు ఎస్పీ..
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగరావుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేసు దర్యాప్తులో భాగంగా విచారణకు పిలిచి అదుపులోకి తీసుకున్నారు. భుజంగరావు ఇంటెలిజెన్స్ పొలిటికల్ వింగ్‌లో అడిషనల్ ఎస్పీగా పనిచేశారు భుజంగరావు. ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతి రావు కలిసి ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. మరో వైపు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సైబర్ క్రైమ్ అధికారులు, నిపుణుల సహకారం తీసుకుంటున్నారు దర్యాప్తు అధికారులు. గతేదాడి డిసెంబర్ 4న రికార్డుల ధ్వంసం సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు పోలీసులు. కాగా మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును రేపు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది.