Bhatti Vikramarka: తడిచిన ధాన్యాన్ని భట్టికి చూపించిన మహిళా రైతులు
Bhatti Vikramarka: రైతులను, స్థానికులను పలకరిస్తూ ముందుకుసాగిన భట్టి
Bhatti Vikramarka: హన్మకొండ జిల్లాలో సీఎల్పి నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది. భట్టి పాదయాత్ర ధర్మసాగర్ నుంచి నారాయణగిరి చేరుకుంది. మార్గమధ్యలో రైతులను, స్థానికులను పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు.అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొందరు మహిళలు భట్టికి చూపిస్తూ పరిస్థితిని వివరించారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుందని భరోసానిచ్చారు . ఈ పర్యటనలో భట్టివెంట మాజీ మంత్రి పొన్నాల కూడా ఉన్నారు.