Bhatti Vikramarka: పేపర్ లీకేజీ ఘటనలో TSPSC ఛైర్మనతో పాటు సెక్రటరీని తొలగించాలి
Bhatti Vikramarka: నష్టపోయిన విద్యార్థుల ఖర్చులను ప్రభుత్వమే భరించాలి
Bhatti Vikramarka: ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో పాదయాత్ర మూడోరోజు కొనసాగింది. ఖానాపూర్ నియోజకవర్గంలోని ఇంద్రవెల్లి మండలంలో హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పర్యటించారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నాగోబా ఆలయాన్ని దర్శించుకుని ఆదివాసులతో స్థానిక సమస్యలపై ముచ్చటించారు. TSPSC పేపర్ లీకేజీ ఘటనలో TSPSC ఛైర్మనతో పాటు సెక్రటరీ, సభ్యులందరినీ తొలగించాలన్నారు. బాధ్యులైన మంత్రులను సైతం బర్తరఫ్ చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీతో నష్టపోయిన విద్యార్థుల ఖర్చులను ప్రభుత్వమే భరించాలన్నారు.