World Record: భద్రాద్రి జిల్లా విద్యార్థి శశాంక్ ప్రపంచ రికార్డు

* పిరియాడిక్‌ టేబుల్‌లో అన్ని మూలకాలను 1:03 సెకన్లలో రాసిన విద్యార్థి * ముందున్న 1:18 సెకన్ల ప్రపంచ రికార్డు బద్దలు

Update: 2021-07-27 03:59 GMT

అత్యంత వేగంగా రాయడంలో ప్రపంచ రికార్డు (ఫైల్ ఫోటో)

World Record: భద్రాద్రి జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. తాను పుట్టి పెరిగిన మణుగూరుకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చాడు. డిగ్రీ సెకండియర్‌ చదువుతున్న శశాంక్‌.. ఈ నెల 2న ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ వారు నిర్వహించిన పోటీ పరీక్షలో పాల్గొన్నాడు. పిరియాడిక్ టేబు‌లో ఉన్న అన్ని మూలకాలను కేవలం ఒక నిమిషం 3 సెకన్లలో రాసి, అత్యంత వేగంగా రాయడంలో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతకుముందున్న ఒక నిమిషం 18 సెకన్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. మణుగూరు కీర్తి పతాకాన్ని ప్రపంచ స్థాయిలో ఎగరవేశాడు.

ఈ సందర్భంగా శశాంక్ మాట్లాడుతూ తన తల్లిదండ్రుల ప్రోత్బలంతో పదిరోజులపాటు వేగంగా రాయడం సాధన చేశానని అన్నాడు‌. అలాగే తాను సాధించిన ఈ విజయంలో పాఠశాల యాజమాన్యం పాత్ర కూడా ఎంతో ఉందన్నాడు. మెడల్‌, సర్టిఫికెట్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారి చేతులమీదుగా తీసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని శశాంక్‌ చెప్పాడు. భవిష్యత్‌లో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆకాంక్షించారు.

Tags:    

Similar News