తెలుగు రాష్ట్రాల్లో జోరందుకున్న బీర్ల అమ్మకాలు
*హైదరాబాద్ లో ఒక్కరోజే లక్షల కేసుల సేల్స్
Beer Sales: రాష్ట్రంలో భానుడు నిప్పులు గక్కుతుంటే వేసవితాపం, వడగాలులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు జనం. దాహార్థిని తీర్చుకునే క్రమంలో కాసిన్నిచల్లని నీళ్లు దొరికితే చాలనుకుంటున్నారు. కానీ మందుబాబు మాత్రం చల్లచల్లని బీర్లను తెగ తాగేస్తున్నారట. తాజాగా ఎక్సైజ్ శాఖ రిలీజ్ చేసిన బీర్ల అమ్మకాలు అవుననే చెబుతోంది. ఈ జాబితా ప్రకారం హైదరాబాద్ లో రోజుకు 10లక్షల లీటర్లకు పైగా బీర్లును లాగిస్తున్నారు ఈ మందుబాబులు. వీకెండ్ లో ఎక్కువగా యువత బిర్ల వైపే మొగ్గు చూపుతున్నారట. దీంతో హీట్ సమ్మర్ లో కూలింగ్ బీర్లకు బలే డిమాండ్ పరిగిందట.
తెలుగు రాష్ట్రాల్లో లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వేసవి కాలం మొదలుకావడంతో మద్యం ప్రియులు చల్ల చల్లని బీర్లు తాగేందుకు ఇష్టపడుతున్నారు. ప్రభుత్వం సైతం వైన్ షాప్‌లకు బీర్ల కొరత లేకుండా చూస్తోంది. దీంతో బీర్లకు డిమాండ్ పెరిగింది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజు లక్షలకేసుల బీర్లు మద్యం అమ్ముడవుతున్నాయంటే నిషాచారులు రాష్ట్రానికి ఎంత రెవిన్యూ తెస్తున్నారో అర్థమవుతోంది. ఇక వారమంతా ఆఫీసుల్లో కష్టపడి ఉద్యోగులు, అలసట నుండి రిలీఫ్ పొందేందుకు వీకెండ్స్ బీర్లు పొంగిస్తుంటే ఈబీర్ల వీకెండ్ సేల్స్ అమాంతంగా పెరుగుతున్నట్లు ఎక్సైజ్ శాఖ రిపోర్టులు చెబుతున్నాయి. ఐటీ, బీపీఓ, రియాల్టీ సేవా రంగాల్లో పనిచేస్తున్నవారు సైతం వీకెండ్ పార్టీలో ఎక్కువశాతం చల్లచల్లని బీర్లను ప్రిఫర్ చేస్తుండటంతో ఈ అమ్మకాలు అమాతంగా పెరిగిపోతున్నాయట.
జంటనగరాల్లో ఎండల వేడి పెరిగిపోతుండటంతో మద్యం ప్రియులు చల్లని బీరును కోరుకుంటున్నారు. సాధారణం రోజుల్లో ఒక్క హైదరాబాద్ లోనే 10కోట్ల నుండి 15కోట్ల బీర్లు అమ్మకాలు జరిగితే గత రెండు వారాలుగా వీకెండ్స్ లో ఈసేల్స్ 60 కోట్లకు పెరిగింది. ఇదే అదనుగా భావిస్తున్న కొందరు వ్యాపారులు. బీర్లను ఎంఆర్పీ కంటే అధికంగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో బీరుపై అదనంగా 20 నుండి 30 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నట్లు మద్యం ప్రియులు చెబుతున్నారు. ఇక విదేశీ బీర్లపై 50 నుంచి 100వరకు అధికంగా వసూలు చేస్తుండటంతో ప్రస్తుతం ఒక్కో బీరు 300 కు పెరిగింది. సాధారణంగా విదేశీ బీర్ల దిగుమతిపైట టాక్స్ వసూలు చేయడంతో పాటు ఎంఆర్పీని కుడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. కానీ కొందరు వ్యాపారులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా ధరలు పెంచి అమ్ముతున్నారు. వ్యాపారులపై చర్యలు తీసుకోవాలంటు డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా హైదరాబాద్ లో మద్యం అమ్మకాలు పెరిగిపోవడంపై వైద్యులు మరో వర్షన్ చెబుతున్నారు. సమ్మర్ లో కూలింగ్ బీర్లు అధిక మోతాదులో తాగడం వల్ల అప్పటికప్పుడు ఉపశమనం లభించినా అనారోగ్య సమస్యల బారినపడటం ఖాయమంటున్నారు. క్రమం తప్పకుండా మద్యం సేవిస్తే అనారోగ్యాల భారినపడే ప్రమాదం ఉందంటున్నారు. వేసవిలో బీరులో ఉండే ఆల్కాహాల్ పర్సంటేజ్ ఎక్కువైతే కాళ్లు చేతులు తిమ్మిర్లు రావడం, మొద్దుబారిపోవడంతో పాటు, మెదడుపై ప్రభావం పడి ఆలోచన శక్తితగ్గిపోయే ప్రమాదం ఉందంటున్నారు. అంతేకాదు ఎక్కువసార్లు మూత్రవిసర్జన వల్ల శరీరంలోని సోడియం, పొటాషియం బయటికు వెళ్లే ప్రమాదం ఉదంటున్నారు. రోజుకు 90మి.లీ కంటే ఎక్కువగా ఆల్కాహాల్ తీసుకుంటే కాలేయంపై నేరుగా ప్రభావం పడొచ్చని హెచ్చరిస్తున్నారు.