Vajresh Yadav: రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలందరూ ఐకమత్యంతో ఉండాలి
Vajresh Yadav: తెలంగాణలోని బీసీలందరూ ఐకమత్యంగా ఉండి రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాలని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు.
Vajresh Yadav: తెలంగాణలోని బీసీలందరూ ఐకమత్యంగా ఉండి రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాలని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. బాలాపూర్ రోడ్డు లోని వైఎంఆర్ గార్డెన్స్ లో బిసి ఐక్యవేదిక సదస్సుకు ముఖ్య అతిథులుగా మాజీ టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ వీహెచ్, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ , రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు నంది కంటి శ్రీధర్, టీపీసీసీ ప్రధాన కరదర్శి సరిత వెంకటేష్ లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని బీసీ యువకులకు ఎటువంటి స్వయం ఉపాధి పథకాలు లేక, నియామకాలు లేక అడుగడుగున అవమానమే జరుగుతుందని జనాభా దామాషా ప్రకారం రాష్ట్రంలో 54 శాతంగా ఉన్న బీసీలను కొంతమంది అల్ప సంఖ్యాకులుగా ఉన్నవారు నియంత్రణ చేసే పరిస్థితి తయారయిందని, రానున్న రోజుల్లో బీసీలకు దామాషా ప్రకారం సంక్షేమ పథకాలు రూపొందించి అన్నింటిలోనూ బీసీలకు ప్రాధాన్యత నివ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే బీసీలంతా ఏకమై తమ హక్కులను సాధించుకునేందుకు ఉద్యమానికి సిద్ధమవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుల కార్యకర్తలు పాల్గొన్నారు.