‌Hyderabad: హైదరాబాద్‌‌కు చేజారిన అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు

‌Hyderabad: హోమ్‌ సిరీస్‌లో నగరానికి ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ను ఇవ్వకూడదని బీసీసీఐ నిర్ణయం

Update: 2021-09-21 07:34 GMT

హైదరాబాద్ కు చేజారిన అంతర్జాతీయ మ్యాచ్ లు -రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఫైల్ ఇమేజ్)

Hyderabad: హైదరాబాద్‌‌కు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు చేజారాయి. హోమ్‌ సిరీస్‌లో నగరానికి ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఇవ్వకూడదని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది బీసీసీఐ బోర్డు అపెక్స్ కౌన్సిల్. దేశంలో వచ్చే ఏడాది నవంబర్‌, జూన్ మధ్య నాలుగు టెస్ట్‌లు, 3 వన్డేలు, 14 టీట్వంటీలు సహా మొత్తం 21 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉన్నాయి. న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌తో జరిగే ఏ సిరీస్‌లోనూ హైదరాబాద్‌ వేదికగా ఒక్క మ్యాచ్ కేటాయించలేదు బీసీసీఐ. ఇటీవల హెచ్‌సీఏలో అంతర్గత కుమ్ములాట కారణంగా ఉప్పల్ వేదికగా అంతర్జాతీయ మ్యాచ్‌లు చేజారినట్లు తెలుస్తోంది. పరస్పరం హెచ్‌సీఏలో నెలకొన్న వేభేదాలను బీసీసీఐ బోర్డు తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. హెచ్‌సీఏలో అనిశ్చితి, గందరగోళం కారణంగా బీసీసీఐ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Full View


Tags:    

Similar News