సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిసిన బీసీ నేతలు
Bhatti Vikramarka: ప్రతి పార్లమెంట్‌కి రెండు చొప్పున 34 స్థానాలు..
Bhatti Vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు కలిశారు. టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ నేతృత్వంలో భట్టి నివాసంలో సమావేశమయ్యారు. తమకు కేటాయిస్తామన్న ప్రతి పార్లమెంట్‌కు 2 చొప్పున 34 స్థానాలపై క్లారిటీ ఇవ్వాలని భట్టి విక్రమార్కకు వినతి చేశారు. 34 సీట్లు కేటాయించాల్సిందేనని ఆ పార్టీ బీసీ నేతలు స్పష్టం చేశారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ మేరకు సీట్ల కేటాయింపులో బీసీలకు న్యాయం చేయాలంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీలను కలిసి విజ్ఞప్తి చేయాలని తీర్మానించింది.