Bank Holidays In October : అక్టోబర్ లో వచ్చే బ్యాంకు సెలవులు ఇవే

Update: 2020-10-01 03:40 GMT

Bank Holidays In October : కరోనా వైరస్ విస్తరించిన తర్వాత బ్యాంకుల పనులలో చాలా మార్పు వచ్చింది. ప్రజలందరూ చాలావరకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ మీదనే ఆధారపడుతున్నారు. అయితే ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు పనులు ఉన్నవారు అక్టోబర్ లో వచ్చే సెలవు దినాలు తెలుసుకోవడం ఉత్తమం. అయితే అక్టోబర్ నెలలో గాంధీ జయంతి, దసరా పండుగ, మిలాద్ ఉన్ నబీ ఉన్నాయి. ఇక అక్టోబర్ 4, 11, 18, 25 తేదీలలో ఆదివారాలు. ఈ రోజుల్లో బ్యాంకులకు సెలవు. అక్టోబర్ 10, 24 తేదీలు రెండో, నాలుగో శనివారాలు వస్తున్నాయి.

కనుక ఆ రోజుల్లోనూ బ్యాంకులకు పబ్లిక్ హాలీడే ఉంటుంది. వీటితో పాటు అక్టోబర్ 2న గాంధీ జయంతి, అక్టోబర్ 30న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు హాలిడే ఉంటుంది. కాగా, దసరా పండుగకు ప్రత్యేకంగా ఈ ఏడాది బ్యాంకులకు సెలవు రాలేదు. నాలుగో శని, ఆదివారాల్లో విజయదశమి వచ్చింది. ఆర్బీఐ ఈ సెలవు ప్రకటించకపోయినా బ్యాంకులకు ఎలాగూ నాలుగో శనివారం, ఆదివారం సెలవు ఉంటుంది. ఇంకా ఏమైనా పూర్తి వివరాలు కావాలనుకుంటే రిజర్వ్ బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌ చూడాలి.

Tags:    

Similar News