Bandi Sanjay: న్యాయం చేయమని ప్రశ్నిస్తే నోటీసులిస్తారా?
Bandi Sanjay: సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపితే ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటి?
Bandi Sanjay: నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా పోరాటాన్ని విరమించేది లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇందిరాపార్కు వద్ద నిరుద్యోగ మహాధర్నాలో ఆయన మాట్లాడారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్ ధర్యాప్తుతో ఎలాంటి ప్రయోజనం ఉండదని, సిట్టింగ్ జడ్జితోనే న్యాయ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయవిచారణతో అక్రమాలన్నీ వెలుగులోకి వస్తాయనే అభిప్రాయం వ్యక్తంచేశారు. న్యాయవిచారణకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు.