Jagtial: మూలుగ బొక్క కోసం వివాదం.. నిలిచిన పెళ్లి

Jagtial: నిశ్చితార్థం విందులో తలెత్తిన వివాదం

Update: 2023-12-24 04:14 GMT

Jagtial: మూలుగ బొక్క కోసం వివాదం.. నిలిచిన పెళ్లి

Jagtial: బలగం సినిమాలో మూలుగ బొక్క కోసం బావ బామ్మర్దుల మధ్య గొడవ జరుగుతుంది. అచ్చం అలాగే మూలుగ బొక్క కోసం జరిగిన గొడవతో పెళ్లి సంబంధం రద్దయిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన అబ్బాయికి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది.

కట్నకానుకలు సైతం మాట్లాడుకున్నారు. నిశ్చితార్థం సందర్భంగా అమ్మాయి ఇంట్లో మాంసాహారంతో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అబ్బాయి బంధువులు మూలుగ బొక్క కావాలని అడగడంతో ఇరువర్గాల మధ్య గొడవ మొదలైంది. గొడవ పెద్దదై చివరికి పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లింది. తర్వాత ఇరువర్గాలు శాంతించినప్పటికీ పెళ్లి సంబంధాన్ని రద్దు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News