ఒంటికన్నుతో శిశువు జననం
Baby Born with One Eye : శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వారి కాలజ్ఞానంలో చెప్పిన కొన్ని వింతలు అప్పుడప్పుడు వింటూనే ఉంటాం.
Baby Born with One Eye : శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వారి కాలజ్ఞానంలో చెప్పిన కొన్ని వింతలు అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. మనిషి రూపంలో జంతులు పుట్టడం, అప్పుడే పుట్టిన పిల్లలు నడవడం, వేప చెట్టుకు పాలు రావడం ఇలాంటి ఎన్నో వింతలు విన్నాం. ఇప్పుడు ఇలాంటి వింతే తెలంగాణ రాష్ట్రంలోనూ జరిగింది. ఈ వింతను చూసిన వారు ఆశ్చర్యపోక తప్పదు. అసలు ఏంటి వింత ఏం జరిగింది అనుకుంటున్నారా. ఓ చిన్నారి ఒంటి కన్నుతో జన్మించాడు. ఈ విచిత్రమైన సంఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళ ఒంటి కన్నుతో ఉన్న మగ శిశువు జన్మనిచ్చింది.
కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన శంకర్ భార్య ప్రియాంక నిండు గర్భిణి. కాగా ఆమె భర్త ప్రసవం కోసం ఆమెను చెన్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆమెకు పురుటి నొప్పులు రావడంతో వైద్యులు ఆమెకు సాధారణ ప్రసవం చేసారు. ఆ పురిటిలో ఆమెకు ఒంటి కన్నుతో ఉన్న శిశువు జన్మనించాడు. ఇది ఆమెకు రెండవ సంతానం. మొదటి సంతానంలో కూతురు జన్మించగా ప్రస్తుతం ఆమెకు రెండు సంవత్సరాల వయస్సు. కాగా రెండవ సంతానంగా ఒంటి కన్నుతో పుట్టిన ఈ వింత శిశువు పుట్టి ఆ తరువాత కొంతసేపటి చనిపోయినట్టు బంధువులు తెలిపారు. ఇక ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయని, కాంటిజంటల్ సమస్య వల్ల ఇలా జరిగి ఉండవచ్చని వైద్యులు అభిప్రాయ పడుతున్నారు. అయితే గతంలో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇలా ఒంటి కన్నుతో శిశువు జన్మించిన దాఖలాలు లేకపోవడంతో జనం ఈ విషయాన్ని ఓ వింతగా చెప్పుకుంటున్నారు.