Aviation Show: హైదరాబాద్‌లో ఏవియేషన్ షో.. ప్రదర్శనలో 21 రకాల విమానాలు, హెలికాప్టర్లు

Aviation Show: ఇప్పటికే టికెట్ బుక్‌ చేసుకుని సిద్ధమైపోయిన గగనప్రియులు

Update: 2024-01-19 12:30 GMT

Aviation Show: హైదరాబాద్‌లో ఏవియేషన్ షో.. ప్రదర్శనలో 21 రకాల విమానాలు, హెలికాప్టర్లు

Aviation Show: హైదరాబాద్ గగనతలం అబ్బుర పోయింది. రకరకాల విమానాల విన్యాసాలను చూసి మురిసిపోయింది. ఆకాశంలో హరివిల్లులా హైదరాబాద్‌కు సరికొత్త ఆందాలను మోసుకొచ్చింది ఏవియేషన్ షో. ఆకాశంలో అద్భుత విన్యాసాలకు, వివిధ రకాల విమానాల ప్రదర్శనకు బేగంపేట ఎయిర్​పోర్టు మరోసారి వేదికైంది. ‘వింగ్స్ ఇండియా–2024’ ఏవియేషన్ షో సందడిగా జరుగుతోంది. నిన్న మొదలైన షో ఈనెల 21వరకు జరగనుంది. రేపటి నుంచి సాధారణ ప్రేక్షకులకు కూడా ఎంట్రీ ఉండడంతో ఏవియేషన్ షో ఇంకాస్త సందడిగా,, కలర్ ఫుల్‌గా మారబోతోంది.

గ్రేటర్‌లో రెండేళ్లు ఒకసారి జరిగే ఈ షో కోసం గగణ ప్రియులు ఇప్పటికే రెడీ అయిపోయారు. తమకు నచ్చిన విమానాలు, ఎలికాఫ్టర్లను తనివితీరా చూసి మధురానుభూతి పొందబోతున్నారు. సెల్ఫీలతో తమ ఆనందాలను సెల్‌ఫోన్లలో బంధీ చేసుకోబోతున్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ షోలో 106 దేశాల నుంచి 1,500 మంది ప్రతినిధులు, 5 వేల మంది బిజినెస్ విజిటర్స్, వివిధ దేశాల నుంచి లక్ష మంది సందర్శకులు, ప్రపంచవ్యాప్తంగా 200 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. చార్టెడ్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు, 21 రకాల విమానాలు ప్రదర్శనలో ఉన్నాయి.

ఏవియేషన్​ షోలో మొదటి రెండ్రోజులు వ్యాపార వేత్తలు, దేశవిదేశాల ప్రతినిధులకు మాత్రమే ఎంట్రీ ఉంది. మిగతా రెండ్రోజులు రేపు, ఎల్లుండి సాధారణ ప్రజలను అనుమతిస్తారు. బుక్​మైషో ద్వారా 750 రూపాయలు పెట్టి, టికెట్ ​బుక్ ​చేసుకోవాల్సి ఉంటుంది. మూడేండ్లు పైబడినోళ్లందరూ టికెట్ తీసుకోవాలి. ఉదయం 10 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తారు. అయితే 30 అడుగుల దూరం నుంచి మాత్రమే విమానాలకు చూసేందుకు వీలుంటుంది.

ఈ షోలో భాగంగా ఇండియన్​ ఎయిర్​ఫోర్స్ కు చెందిన సారంగ టీమ్ ప్రతిరోజూ సాయంత్రం 4:15 గంటల నుంచి 5 గంటల దాకా విన్యాసాలు చేస్తుంది. అలాగే దేశవిదేశాలకు చెందిన 21​ విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద విమానమైన బోయింగ్​777 ఎక్స్​ను దేశంలోనే తొలిసారిగా బేగంపేట ఎయిర్​పోర్టులో ప్రదర్శిస్తున్నారు. రేపటి నుంచి సాధారణ ప్రేక్షకుల అనుమతి ఉండటంతో..ఇప్పటికే నగర వాసులు సిద్ధం అయిపోయారు. టికెట్లు బుక్ చేసుకుని..ఎప్పుడెప్పుడు ఏవియేషన్‌ షోను తిలకిస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News