Telangana Assembly: ఆర్టీసీ బిల్లు ఆమోదం కోసం అసెంబ్లీ పొడిగింపు యోచన
Telangana Assembly: ఇప్పటికే రెండుసార్లు వివరణలు కోరిన గవర్నర్
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి వరకు కొనసాగించే యోచన ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ బిల్లు ఆమోదం కోసం అసెంబ్లీ పొడిగించాలని నిర్ణయించింది. బిల్లుకు సంబంధించి ఇప్పటికే గవర్నర్ రెండుసార్లు వివరణలు కోరారు. గవర్నర్ వివరణలకు రాష్ట్రప్రభుత్వం సమాధానం పంపింది. దీంతో ఆర్టీసీ విలీన బిల్లుపై గవర్నర్ ఏ నిర‌్ణయం తీసుకుంటారన్న సందిగ్ధత కొనసాగుతోంది. ఇటు ప్రైవేట్ కంపెనీలలో స్థానికులకు రిజర్వేషన్లపై... శాసనమండలిలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. పేదలకు ఇళ్ల విషయంలో ప్రభుత్వ హామీపై చర్చ చేపట్టాలని... శాసనసభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది.