Asaduddin Owaisi Test For Covid-19: కరోనా టెస్టులు చేయించుకున్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. ఎం వచ్చిందంటే?
Asaduddin Owaisi Test For Covid-19: ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కరోనా వైరస్ టెస్టులు చేయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు
Asaduddin Owaisi Test For Covid-19: ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కరోనా వైరస్ టెస్టులు చేయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.. తాను యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ టెస్టులను చేయించుకున్నానని వెల్లడించారు. అరగంటలోనే ఫలితం వచ్చే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగటివ్ అనే ఫలితం వచ్చిందని ఆయన తెలిపారు. యాంటీజెన్ టెస్టులో ఓవైసీకి నెగటివ్ అని రావడంతో ఆయన రిలాక్స్ అయ్యారు. ఇక హైదరాబాద్ దక్షిణ ప్రాంతంలో దాదాపుగా 30 సెంటర్లలో యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారని ఆయన తెలిపారు.. ఇక కరోనా టెస్టులు చేసుకునేందుకు ఎవరు సందేహించవద్దునని అన్నారు.. ప్రతి ఒక్కరూ టెస్టులు చేసుకోవాలని హైదరాబాదీ లను ఎంపీ ఈ సందర్భంగా కోరారు.. ఇక ఒక్క హాస్పిటల్ లో వెయ్యి మందికి కరోనా టెస్టులు చేయాలని గతంలో ప్రభుత్వాన్ని అసదుద్దీన్ కోరిన సంగతి తెలిసిందే...
నగరంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాపిడ్ టెస్టులను చేయాలని నిర్ణయించింది. దీని కోసం కొన్ని ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలు చేస్తున్నారు. హైదరాబాద్ లో 50, రంగారెడ్డి జిల్లాలో 20, మేడ్చల్‌లో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వీటిని నిర్వహిస్తున్నారు. ఇక ఈ పరీక్షల ద్వారా కేవలం అరగంటలోనే ఫలితం తెలుసుకోవడమేనని అధికారులు అంటున్నారు.. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఇక ఈ విధానంలో తొలిసారి పాజిటివ్ ఫలితం వస్తే రెండోసారి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే, నెగటివ్ వస్తే మాత్రం ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సిద్దం చేస్తున్నట్టుగా తెలుస్తోంది .
ఇక తెలంగాణలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి నిన్నటివరకూ ఉన్న సమాచారం మేరకు శుక్రవారం కొత్తగా రాష్ట్రంలో 1278 కరొనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 32,224కు చేరుకుంది. ఇక కొవిడ్-19 కారణంగా రాష్ట్రంలో మరో 8 మంది మరణించారు. దాంతో మరణాల సంఖ్య 339 కు చేరింది. శుక్రవారం నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 762 కేసులు వచ్చాయి. ఇక 1,013మంది వైరస్ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 19,205 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 12,680 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.