Asaduddin Owaisi: ఇండియా కూటమితో లాభం లేదు
Asaduddin Owaisi: ఇండియా కూటమి కాకుండా థర్డ్ ఫ్రంట్ ఏర్పడాలి
Asaduddin Owaisi: ఇండియా కూటమిపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల ఇండియా కూటమితో లాభం లేదని అన్నారు. దేశంలో ఎన్డీఏ, ఇండియా కూటమి కాకుండా థర్డ్ ఫ్రంట్ ఏర్పడాలని అభిప్రాయపడ్డారు. థర్డ్ ఫ్రంట్‌ను తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లీడ్ చేస్తే బాగుంటుందన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడ్డ ఇండియా కూటమికి బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు దూరంగా ఉంటున్నాయి. ఇప్పటికే రెండు, మూడుసార్లు భేటీ అయిన ఇండియా కూటమి.. ఈ రెండు పార్టీలకు మాత్రం ఆహ్వానం పంపలేదు. ఈ క్రమంలో అసదుద్దీన్ చేసిన థర్డ్ ఫ్రంట్ కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారాయి.