MLC Elections 2021: రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించేందుకు ఏర్పాట్లు

MLC Elections 2021: మొదటి స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి * రెండో స్థానంలో తీన్మార్ మల్లన్న * మూడో స్థానంలో కోదండరామ్

Update: 2021-03-19 06:29 GMT

ఫైల్ ఫోటో 

MLC Elections 2021: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇప్పటికే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యాయి. అందులో ఎవరికి సరైనా మోజారిటీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. రెండో ప్రాధాన్యత ఓట్లలో 59మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేశారు. మిగతా పన్నెండు మందిలో తొమ్మిది మంది అభ్యర్థుల రెండో ప్రాధన్యత ఓట్లను లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానానికి 71 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

మొదటి ప్రాధాన్యతలో వచ్చిన ఓట్లలలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లారాజేశ్వర్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. రెండోస్థానంలో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న, మూడో స్థానంలో కోదండరామ్ ఉన్నారు. రెండో స్థానం కోసం తీన్మార్ మల్లన్న, ప్రొఫెసర్ కోదండరామ్‌ పోటీపడుతున్నారు. రెండో స్థానం కోసంపై కోదండరామ్ గంపెడు ఆశలు పెట్టుకున్నారు. రెండో ప్రాధాన్యతలో కోదండరామ్‌కి వన్‌సైడ్ గా వస్తేనే పల్లాను చేరుకునే అవకాశం ఉంటుంది. తనకే రెండో ప్రాధాన్యతలో కోదండరామ్ కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు తీన్మార్ మల్లన్న అయితే ఎలిమినేషన్‌లో ఫస్ట్ నుంచి మూడో అభ్యర్థిగా తాము ఉండొద్దని అంచనా వేస్తున్నారు కోదండరామ్, తీన్మార్ మల్లన్న.

Tags:    

Similar News