YS Sharmila: పాలమూరు ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా..?
YS Sharmila కృష్ణా జలాలు పారించిన ఘనత ఎవరిదో చర్చకు రాగలరా
Y S Sharmila: సీఎం కేసీఆర్‌పై YSRTP అధ్యక్షురాలు షర్మిల మరోసారి మండిపడ్డారు. కష్టం ఒకరిదైతే ప్రచారం మరొకరది సామెత కేసీఆర్‌కు సరిపోతుందన్నారు. పాలమూరు కన్నీళ్లను చూసి సాగునీళ్లు ఇచ్చింది YSR అయితే... కేసీఆర్ తానే జలకళ తెచ్చినట్లు గప్ఫాలు కొ్టటుకుంటున్నారని ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. పడావు పడ్డ బీడు భూముల్లో కృష్ణా జలాలు పారించిన ఘనత ఎవరిదో చర్చకు రాగలరా అని ప్రశ్నించారు. YSR హయాంలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తే.. మీ పదేళ్ల పాలనలో ఒక్క ఎకరాకు అదనంగా సాగునీరు ఇచ్చారా దొర గారు ? అని ట్విట్టర్ వేదికగా షర్మిల ఎద్దేవా చేశారు.