Andhra Pradesh: జనసేనాని పవన్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు
Andhra Pradesh: మూడు పెళ్లిళ్ల వ్యాఖ్యలను పవన్ తక్షణమే వెనక్కి తీసుకోవాలి- వాసిరెడ్డి పద్మ
Andhra Pradesh: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. మూడు పెళ్లిళ్ల వ్యాఖ్యలను పవన్ తక్షణమే వెనక్కి తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ నోటీసుల్లో పేర్కొన్నారు. మహిళా లోకానికి పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చు అనే సందేశాన్ని.. మీరు ఇస్తూ మాట్లాడిన తీరుతో మహిళా లోకం షాక్‌కు గురైందన్నారు. మీ మాటల్లోని తప్పును తెలుసుకుని సంజాయిషీ ఇస్తారని ఆశించామని.. అయితే మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసినందుకు క్షమాపణలు కూడా చెప్పలేదని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఎవరి జీవితంలో అయినా మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తే అది కచ్చితంగా వ్యతిరేకమేనని చెప్పారు. మిమ్మల్ని ఫాలో అవుతున్న యువత మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చని అనుకోరా? అంటూ వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.