Telangana Rain: మరో రెండ్రోజులు భారీ వర్షాలు

Telangana Rain: ప్రాథమిక హెచ్చరిక జారీచేసిన హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం

Update: 2022-07-28 03:17 GMT

Telangana Rain: మరో రెండ్రోజులు భారీ వర్షాలు

Telangana Rain: రాష్ట్రంలో పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆవర్తనం ఏపీ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి సముద్రమట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొద్ది దక్షిణ దిశకు వంపు తిరిగి ఉన్నదని పేర్కొన్నది. దీని ప్రభావంతో గురువారం భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో శుక్రవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, వికారాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం కురిసినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.

రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 28, 29 తేదీల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ బంగాళాఖాతంలో ఆవర్తనం కేంద్రీకృతమైందని, ఆ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వానలుంటాయని, కొన్ని చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని తెలిపింది. 28న సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వర్ష ప్రభావం ఉంటుందని పేర్కొంది. 29న ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వానలు ఉంటాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

రంగారెడ్డి జిల్లాలోని షాబాద్​లో రాష్ట్రంలోనే అత్యధికంగా10.5 సెం.మీ. వర్షం కురిసింది. చేవెళ్లలో10, ఖమ్మం జిల్లా చింతకానిలో 8, సూర్యాపేట జిల్లా చివ్వెంలలో 7.4, అదే జిల్లా ఆత్మకూర్(ఎస్)లో 7.2 సెం.మీ. వర్షపాతాలు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని పటాన్ చెరులో 3.4 సెం.మీ. వాన కురిసినట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధవారం నాటి రాష్ట్ర సగటు వర్షపాతం 5.9 మిల్లీమీటర్లు ఉండగా, 44 శాతం ఎక్కువగా 8.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

Tags:    

Similar News