Telangana: గొర్రెల స్కాములో మరో ట్విస్ట్.. బయటపడుతున్న అవినీతిపరుల చిట్టా

Telangana: అధికారుల అవినీతి వెనుక..గత ప్రభుత్వ హయాంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఉన్నట్లు ఆరోపణలు

Update: 2024-03-09 05:22 GMT

Telangana: గొర్రెల స్కాములో మరో ట్విస్ట్.. బయటపడుతున్న అవినీతిపరుల చిట్టా

Telangana: గొర్రెల స్కామ్‌లో మరో ట్విస్ట్‌ బయటపడింది. ఏసీబీ దర్యాప్తులో మరో ఇద్దరు అధికారుల చిట్టాలు బయటపడుతున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన గొర్రెల పంపిణీదారులకు వెళ్లే నిధుల గోల్‌మాల్‌పై ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది.ఇప్పటికే ఆవుల సరఫరాలో గోల్‌మాల్‌ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో గొర్రెల అమ్మకదారులకు చెల్లింపుల విషయంలో అవినీతి బయటపడింది. ఇప్పటికే ఈ నిధుల దారిమల్లింపు వ్యవహారంలో నలుగురు అధికారులను ఏసీబీ అరెస్ట్‌ చేసి కస్టోడియల్‌ విచారణ పూర్తి చేసింది.

గొర్రెల స్కామ్‌ అక్రమాల్లో జాయింట్‌ డైరెక్టర్‌, అడిషనల్‌ డైరెక్టర్‌ పాత్రలపై ఏసీబీ దృష్టి పెట్టింది. జేడీ, ఏడీ అవినీతి చిట్టా ఆధారాలను ఏసీబీ సేకరించింది. రంగారెడ్డి జిల్లాలో ఓ మండలంలో 28 యూనిట్ల గొర్రెలను నెల్లూరు సరఫరాదారులతో పంపిణీ చేశారు. గొర్రెల పంపిణీలో అడిషనల్‌ డైరెక్టర్‌ చేతివాటం చూపించారు. ఏడీ గొర్రెల పంపిణీదారులకు డబ్బులు చెల్లించుకుండా బినామీ ఖాతాల్లోకి నిధులు మళ్లించుకున్నారు. పంపిణీదారులకు డబ్బులు చెల్లించకుండా లంచం డిమాండ్‌ చేశారు.

ఏడీ లంచం తీసుకొని గొర్రెల పంపిణీదారులకు నిధులు విడుదల చేశారు. గొర్రెల రైతులు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడంతో ఏడీ అవినీతి బాగోతంపై బయటపడింది. బాధితులు ఇచ్చిన బాగ్మూలం ఆధారంగా అవినీతి అధికారులు వెనుక గత ప్రభుత్వంలోని ఇద్దరు ప్రజా ప్రతినిధులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. అన్ని కోణాల్లో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News