Transforming Anganwadis in Telangana: రూపుమారనున్న అంగన్వాడీలు.. చిన్నారులకు వీడియో ఆటలు, పాటలు

Transforming Anganwadis in Telangana: కరోనా మహామ్మారి ఇంకా ఎన్ని మార్పులు తీసుకొస్తుందో చెప్పలేని పరిస్థితి.

Update: 2020-07-17 02:15 GMT
Anganwadis (File Photo)

Transforming Anganwadis in Telangana: కరోనా వైరస్ మహామ్మారి ఇంకా ఎన్ని మార్పులు తీసుకొస్తుందో చెప్పలేని పరిస్థితి. దీని ప్రభావం మానవ జీవితం నుంచి ఏకంగా వ్యవస్థలను మార్చే వరకు చూపించింది. విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసుల మాదిరిగానే అంగన్వాడీల్లో పిల్లలకు చెప్పే విధానంలో మార్పులు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారుల కోసం నిర్వహించే అంగన్వాడీ స్కూళ్లల్లో వీడియోల్లోనే ఆటలు, పాటలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే వీటినే గతంలో ప్రకటించిన విధంగా ఫ్రీ స్కూళ్లుగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అంగన్‌వాడీల రూపురేఖలు మారనున్నాయి. ఆన్‌లైన్‌లో అఆఇఈ నేర్పనున్నారు. చిన్నారుల్లో ప్రేరణకు కొత్త పాఠ్యాంశా లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివర కు పౌష్టికాహార పంపిణీ కేంద్రాలుగానే కొనసాగిన ఈ కేంద్రాలు త్వరలో ప్రీస్కూళ్లు(పూర్వ ప్రా థమిక పాఠశాల)గా మారనున్నాయి. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో విద్యాసంస్థలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం మూసివేసింది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత అంగన్‌వాడీల బోధనను ఆన్‌లైన్‌లో సాగించేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే అంగన్‌వాడీల నిర్వహణకు సం బంధించిన కార్యాచరణను మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌లో ఉంచింది.

ప్రీ స్కూళ్లుగా 35,700 అంగన్‌వాడీలు

రాష్ట్రంలోని మొత్తం 149 ఐసీడీఎస్‌(సమగ్ర శిశు అభివృద్ధి పథకం) ప్రాజెక్టుల పరిధు ల్లో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నా యి. ఈ కేంద్రాల్లో మూడేళ్లలోపు చిన్నారులు 9.17 లక్షల మంది, మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 4.80 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు బాలామృతంతోపాటు ఇతర పౌష్టికాహారాన్ని అందించేవా రు. ఆ తర్వాత పిల్లల ఆసక్తిని బట్టి ఆడించడం లేదా ఇంటికి పంపడం జరిగేది. ఇక పై ఈ కేంద్రాలు పూర్వ ప్రాథమిక పాఠశాలలు గా మారనున్నాయి. కేంద్రం నిర్దేశించిన నిబంధనల ప్రకారం కనీ సం ఆరుగంటలపాటు ఈ కేంద్రాలను నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం మా త్రం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగించాలని నిర్ణయించింది.

ప్రత్యేక పాఠ్యాంశం

అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల కోసం రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక పాఠ్యాంశాన్ని రూపొందించింది. స్థానిక పరిస్థితుల నేపథ్యంలో కథలు, పాటలు, ఆటలు, మా నసిక అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిం చింది. ఇవన్నీ వీడియోల రూపంలో తయారు చేసింది. పిల్లలకు అలవాట్లు, పరిసరాల గురిం చి ఎరుక పర్చడం, అక్షరాలు నేర్పడం, అంకెల తో కూడిన పాఠాలు, కథలు, నృత్యరూపక పా టలు, సృజనాత్మకత పెంచే పజిల్స్, తెలుగు, ఇంగ్లిష్‌ భాషలపై అవగాహన పెంచే పదాలు, పిల్లల అభివృద్ధి అంశాలతో కూడిన వీడియో లు, యానిమేషన్‌ రూపంలో వీడియోలను ఆ శాఖ సిద్ధం చేసింది. ఇవి అంగన్‌వాడీల్లో అందుబాటులో ఉంటాయి. పిల్లల తల్లిదండ్రుల కోసం ఈ వీడియోలను రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంచారు.

Tags:    

Similar News