ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను నిర్వహిస్తున్న ఉన్నత విద్యావంతుడు

Update: 2021-02-07 07:18 GMT

Representational Image

ఉద్యోగం లేక పోయిన ఏ పనైనా చేసుకొని సగౌరంవంగా బతుకవచ్చని సమాజానికి సందేశం ఇచ్చేలా ఉంది. నిరుద్యోగి @ ఏంఏ బీఈడీ ఓ ఫాస్ట్ ఫూడ్ సెంటర్ అని పెట్టి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నడు ఓ వ్యక్తి. చదివిన చదువులకు ఫలితం లేక పోవడంతో అంతటితో తన జీవితం ఆగిపోలేదంటు తనతో పాటు మరో ఇద్దరు నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాడు.

ములుగు జిల్లాకు చెందిన లకావత్ సమ్ములాల్ నాయక్ ఎకనామిక్స్ లో, ఎంఏ, బీఈడీ చదివాడు. స్వరాష్ర్టం వస్తే మన జాబ్​లు మనకొస్తాయని ఆశతో హైదరాబాద్ వచ్చాడు. తెలంగాణ రాష్ట్ర సాదన కోసం ఉద్యమంలో యాక్టీవ్​గా పాల్గొని దెబ్బలు కూడా తిన్నానని తెలిపాడు. రాష్ట్రం వచ్చిన తరువాత కొలువు రాలేదని తన ఏజ్ ​కూడా అయిపోయిందని ఆవేదన వక్తం చేసాడు ఈ నిరుద్యోగి.

హైదరాబాద్ కు వచ్చి చిన్న జాబ్​లు చేస్తుంటే​ లాక్ డౌన్ లో అది కూడా పోయింది. తర్వాత 'నిరుద్యోగి@ఎంఏ బీఈడీ' పేరుతో వనస్థలిపురంలో ఫాస్ట్​ఫుడ్ ​సెంటర్ పెట్టుకుని జీవిస్తున్నాడు. తనలా పెద్ద చదువులు చదివి జాబ్ రాక ​చాలామంది నిరుద్యోగులకు మార్గదర్శకంగా ఉండాలనే లక్ష్యంతో తను ఫాస్ట్​ఫుడ్ ​సెంటర్​ ను ఎర్పాటు చేసుకుని. ​మరో ఇద్దరు నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో చీకట్లు చూసిన నిరుద్యోగులకు సొంత రాష్ట్రంలోనూ అదే పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

తెలంగాణ రాష్ట్ర సాదన కోసం పాటు పడి తీవ్రంగా నష్ట్రపోయానని.. ప్రభుత్వాలను నమ్ముకోకుండా సొంత ప్రతిభను నమ్మమని నిరుద్యోగులకు సూచిస్తున్నాడు సమ్మూలాల్. ఉద్యోగం కోసం నానా అవస్థలు పడుతు ఇబ్బందులకు గురవుతున్న ఎందరికో ఇది కనువిప్పు అవ్వలానే ఉద్దేశంతో తాను ఫాస్ట్ ఫూడ్ పేరు పెట్టుకున్నాని తెలిపాడు.

Tags:    

Similar News