రేపు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా
Amit Shah: మహబూబ్‌నగర్, కరీంనగర్‌లో అమిత్ షా పర్యటన
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేందుకు మహబూబ్‌నగర్, కరీంనగర్, హైదరాబాద్‌లో పర్యటిస్తారు. ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గ నేతలతో విడతల వారీగా సమావేశంకానున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై రాష్ట్ర బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ఆయన.. అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్ బయలేరుతారు.
మధ్యాహ్నం ఒంటి గంట 50 నిమిషాల నుంచి 2 గంటల 40 నిమిషాల వరకు మహబూబ్‌నగర్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి కరీంనగర్ వెళ్తారు. అక్కడ బీజేపీ నిర్వహించే సమావేశంలో సాయంత్రం 4 గంటల 10 నిమిషాల నుంచి ఐదు గంటల వరకు పాల్గొంటారు. అనంతరం కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. తర్వాత హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో జరిగే మహిళా సమ్మేళనానికి హాజరవుతారు. అనంతరం 7 గంటల 45 నిమిషాలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి తిరిగి ఢిల్లీ వెళ్తారు.