ఇవాళ హైదరాబాద్‌కు రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
Amit Shah: రేపు పోలీస్ అకాడమీలో జరిగే ఐపీఎస్‌ల పరేడ్‌లో పాల్గొననున్న షా
Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. సర్థార్ వల్లభాయ్ పటేల్ పోలీసు అకాడమీలో రేపు జరిగే ఐపీఎస్‌ల పరేడ్‌లో పాల్గొనేందుకు ఇవాళ రాత్రి 10గంటల 15 నిమిషాలకు నగరానికి రానున్నారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని..అక్కడి నుంచి పోలీస్ అకాడమీకి రోడ్డుమార్గం ద్వారా రాత్రి 10.40 గంటలకు చేరుకొని అక్కడే బస చేయనున్నారు. రేపు ఉదయం 7.50 గంటల నుంచి 10.30 గంటల వరకు పోలీస్ అకాడమీలో నిర్వహించే పరేడ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
పరేడ్ అనంతరం..11 నుంచి 12 గంటల వరకు అధికారులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల వరకు భోజన విరామం అనంతరం అకాడమీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.25 గంటలకు అమిత్ షా ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో 74వ ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ జరగనుంది. ఈ బ్యాచ్‌లో మొత్తం 195 మంది శిక్షణ తీసుకున్నారు.