Ration Card: రేషన్ కార్డు ఉన్నవారికి రేవంత్ సర్కార్ భారీ షాక్..వెంటనే ఈ పని చేయండి.!

Ration Card: మీకు రేషన్ కార్డు ఉన్నట్లయితే ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకోవాలి. రేషన్ కార్డులపై రేవంత్ సర్కార్ తాజాగా కీలక అంశాన్ని వెల్లడించింది.

Update: 2024-06-19 03:39 GMT

Ration Card: తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి భారీ షాక్ ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక విషయాన్ని వెల్లడించింది. రేషన్ కార్డు ఉన్నవారు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా రేషన్ కార్డులపై కీలక వ్యాఖ్యలుచేశారు. కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫ్రీగా వైద్యం చేయించుకునేవారికి తెల్ల రేషన్ కార్డు ఉంటే సరిపోదన్నారు. కేవలం రేషన్ కార్డు ఉంటే ఆరోగ్య శ్రీ సేవలు పొందలేరన్నారు.

ఆరోగ్య శ్రీ కార్డులు ఉంటూనే ఫ్రీ వైద్యం పొందవచ్చిన మంత్రి వెల్లడించారు. త్వరలోనే ఈ విధానం అమల్లోకి వస్తుందని తెలిపారు. తెల్లరేషన్ కార్డు ఉన్నవారు కచ్చితంగా ఆరోగ్యశ్రీ కార్డును పొందాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అర్హత ఉన్న ప్రతి ఒక్క కుటుంబం ఆరోగ్య శ్రీ కార్డు పొందాలని మంత్రి సూచించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు ఆరోగ్య శ్రీ కార్డు పొందవచ్చని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు ఉచిత వైద్యం పరిమితిని రూ. 5లక్షల నుంచి రూ. 10లక్షలకు పెంచిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

ఇక వైద్య చికిత్సల కోసం ప్యాకేజీని కూడా 30శాతం పెంచామని మంత్రి వెల్లడించారు. దీంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందించడంలో ఇబ్బందులు ఉండవన్నారు. వచ్చే రెండు వారాల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తామన్నారు. అయితే రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం ఆరోగ్యశ్రీ కార్డు కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవడం మంచిది. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నకిలి, నాసిరకం, కల్తీ ఆహారం అందిస్తున్న హోటళ్లపై దాడులు చేశామని..ఇక నుంచి కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా తనిఖీలు చేపడతామని మంత్రి తెలిపారు. ఇలాంటి చర్యల వల్ల సామాన్యులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి పేర్కొన్నారు.


Tags:    

Similar News